రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం జరిగింది. తహసిల్దార్ విజయను ఓ దుండగుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో విజయ అక్కడిక్కడే మృతిచెందగా ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భోజన విరామ సమయంలో జనం తక్కువ ఉన్నప్పుడు దుండగుడు దాడికి పాల్పడ్డాడు.
తహసిల్దార్ విజయ ను అత్యంత పాశవికంగా పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు కే చంద్రమోహన్. తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ తరపున విజయ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మున్ముందు ఇటువంటి పాశవిక దాడులు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు తహసీల్దార్ కార్యాలయానికి పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ చేరుకున్నారు. ఘటనా తీరును పరిశీలించారు. నిందితుడు గౌరెల్లికి చెందిన సురేశ్‌గా గుర్తించారు.