బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ విజయవంతంగా 3 సీజన్‌లను పూర్తి చేసుకుంది. దీంతో ఇప్పుడు నాలుగో సీజన్‌పై అందరి దృష్టి మళ్లింది. నాలుగో సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది…కంటెస్టెంట్‌లుగా ఈసారి ఎవరు రానున్నారు…?ఇక హోస్ట్‌గా ఎవరు వ్యవహరించనున్నారనే దానిపై అందరిలో ఆసక్తినెలకొంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 4కి మెగాస్టార్ చిరంజీవి హెస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. సీజన్ 3 ఫైనల్ ఈవెంట్‌కి చిరంజీవి ముఖ్యఅతిథిగా రావడంతో రేటింగ్ పెరిగిపోయింది. చిరు గ్లామర్‌కి తోడు ఎవరు గెలుస్తారా అన్న ఉత్కంఠ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు టీవీల ముందే కూర్చుకున్నారు.
ఈ నేపథ్యంలోనే సీజన్ 4కి చిరు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. గతంలో నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంకి హోస్ట్‌గా వ్యవహరించగా తర్వాత సీజన్‌లో చిరు హోస్ట్‌గా ఈ ప్రోగ్రాం విజయవంతంగా జరిగింది. తాజాగా బిగ్ బాస్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోందని టాక్. నాగ్ తర్వాత సీజన్ 4కి చిరు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడని టీ టౌన్‌లో ప్రచారం జరుగుతోంది.
మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, సెకండ్ సీజన్ ను నాని హోస్ట్ చేశారు. ఇక సీజన్ 4కి చిరు హోస్ట్‌గా వ్యవహరించనున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.