బిగ్ బాస్ 3 విజేతగా రాహుల్…ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా?

371
Biggboss3 Rahul
- Advertisement -

మూడు నెలల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో బిగ్ బాస్3 విజయవంతంగా పూర్తైంది. రన్నర్ గా శ్రీముఖి .. విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో రాహుల్ విజేతగా నిలిచినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఫైనలిస్టులు శ్రీముఖి, రాహుల్ మధ్యలో నాగార్జున ఇద్దరి చేతులు పట్టుకోగానే, అందరిలోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. చివరికి నాగ్ సింగర్ రాహుల్ చేతిని పైకెత్తడంతో రాహుల్ విన్నర్ అయినట్లు ప్రకటించారు.

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోపీ, రూ.50లక్షల చెక్కును అందుకున్నారు. ఈసందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తనను గెలిపించినందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నా తల్లితండ్రుల కడుపులో పుట్టినందుకు చాలా హ్యాపిగా ఉందన్నారు. జూలై 21న ప్రారంభమైన ఈ షోలో రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్‌, అలీ రెజా, శివజ్యోతి, వితిక, మహేశ్‌ విట్టా, పునర్నవి భూపాలం, రవి కృష్ణ, హిమజ, శిల్పా చక్రవర్తి, అషురెడ్డి, రోహిణి, తమన్నా సింహాద్రి, జాఫర్‌, హేమలు కంటెస్టెంట్లుగా హౌస్ ‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

వీళ్ళలో రాహుల్‌, శ్రీముఖి, బాబా భాస్కర్‌, వరుణ్‌ సందేశ్‌, అలీ రెజాలు ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. రాహుల్‌కి అత్యధికంగా 35 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. శ్రీముఖికి 28 శాతం, బాబా భాస్కర్‌కు 20%, వరుణ్ సందేశ్‌కు 10%, అలీ రెజాకు 7% ఓటింగ్ వచ్చినట్లుగా సమాచారం.

- Advertisement -