పింక్ మూవీ రిమేక్ తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ!

368
Pawan kalyan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్నాతవాసి మూవీ విడుదల తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయ్యారు. కాగా ఇటివలే జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతంది. ఈసినిమాకు క్రిష్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తుంది. అయితే ఈపుకార్లపై పవన్ కళ్యాణ్ టీం స్పందించకపోయినప్పటికే ఇండస్ట్రీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది.

ఇక పవన్ కళ్యాణ్‌ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్. పవన్ కల్యాణ్ సినిమా తెరకెక్కబోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. తమిళంలో బాలీవుడ్ సినిమా ‘పింక్’ను రీమేక్ చేసిన బోనీ కపూర్… ఇప్పుడు దిల్ రాజుతో చేతులు కలపారు. ‘పింక్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించబోతున్నారు అంటూ తెలిపాడు. దీంతో పవన్ కళ్యాణ్‌ అభిమానుల్లో తమ అభిమాన నటిని మరోసారి వెండితెరపై చూడవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -