నవంబర్ 3 నుంచి భారత్-బంగ్లా టీ20 సిరీస్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మూడు టీ20ల సిరీస్‌కు కోహ్లీకి రెస్ట్ ఇచ్చారు సెలక్టర్లు. కోహ్లీ స్ధానంలో టీ20 సారథ్య బాధ్యతలను చేపట్టారు రోహిత్. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టీ20ల్లో నెంబర్ 1గా ఉన్న కోహ్లీ స్ధానంపై కన్నేశారు రోహిత్ .
కొంతకాలంగా కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య నెం.1 స్థానం కోసం పోటీ నడుస్తోంది. దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్‌లో కోహ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకోగా.. బంగ్లా సిరీస్‌లో రాణించడం ద్వారా కోహ్లీ స్ధానాన్ని భర్తీచేయాలని భావిస్తున్నారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఢిల్లీ వేదికగా జరగనుంది.
కోహ్లీ ప్రస్తుతం 67 ఇన్నింగ్స్‌ల్లో 2,450 పరుగులతో నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ 90 ఇన్నింగ్స్‌ల్లో 2,443 పరుగులతో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు చేస్తే చాలు అగ్రస్థానం దక్కనుంది.