జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఐదు దశల్లో జార్ఖండ్ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నవంబర్ 30న తొలి విడుత,డిసెంబర్ 7న రెండో విడత,డిసెంబర్ 12న మూడో విడత,డిసెంబర్ 16న నాలుగో విడత,డిసెంబర్ 20న ఐదో విడత ఎన్నికలు జరగనున్నాయి.
నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ సునీల్ అరోరా తెలిపారు. నక్సల్స్ ప్రభావం ఉన్న 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయని తెలిపారు.
2014 ఎన్నికల్లో బీజేపీ 43 స్ధానాల్లో గెలుపొందింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో కలిసి సంకీర్ణ సర్కార్‌ని ఏర్పాటుచేసింది. కాంగ్రెస్‌కు 8 స్ధానాలు రాగా జేఎంఎం 18 స్ధానాలను గెలుచుకుంది. ఈసారి కాంగ్రెస్,జేఎంఎం కూటమిగా బరిలోకి దిగుతుండగా వామపక్షాలు,ఆర్జేడీ కలిసి పోటీచేయనున్నాయి.
జనవరి 5తో జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్ధానాలు ఉన్నాయి.