- Advertisement -
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రామంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభోత్సవంలో భాగంగా పైలాన్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి, ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,తదితర ఉన్నతధికారులు పాల్గొన్నారు. ఈ ప్రారంబోత్సవానికి ప్రజలు,యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
435 ఎకరాల్లో ఏర్పాటైన ఈ పార్క్‌లో 450 పరిశ్రమలు, రూ.1,553 కోట్ల పెట్టుబడులు రానుండటంతో దాదాపు 35 వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అక్కడ పరిశ్రమల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 2 వేల మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
- Advertisement -