సంతన్న సవాల్‌ను స్వీకరించిన బండా ప్రకాష్..

493
mp banda prakash
- Advertisement -

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ హంటర్ రోడ్డు లోని వన విజ్ఞాన కేంద్రంలో హరిత భారత్ నినాదంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌ను రాజ్యసభ సభ్యులు డా. బండా ప్రకాష్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మూడు మొక్కలు నాటారు. ఆయన ఈ సవాల్‌ను మరికొందరికి విసిరారు.

ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌ను తిరిగి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్ నారాయణ సింగ్, మహారాష్ట్ర రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి వందన చవాన్, ఆంద్రప్రదేశ్ లోక్ సభ సభ్యులు డా. సంజీవ్ కుమార్ సింగారి, పుదుచ్చేరి రాజ్యసభ సభ్యులు శ్రీ గోకుల్ క్రిష్ణన్ గార్లకు గ్రీన్ ఛాలెంజ్‌ని ఇచ్చి వారిని కూడా ఒక్కొక్కరు 3 మొక్కలు నాటి హరిత భారత్‌లో భాగం కావాల్సిందిగా ఎంపీ బండ ప్రకాష్ కోరారు.

ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగమైనందుకు ఎంపీ బండా ప్రకాష్ కు రాజ్యసభ సభ్యుటు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -