భారీగా పెరగనున్న పసిడి ధరల..

481
gold
- Advertisement -

బంగారం 10 గ్రాముల ధర ఈ సంవత్సరాంతానికి దేశంలో రూ.42,000ను తాకుతుందని కమోడిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనత, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పసిడి కొనుగోళ్లు వంటి అంశాలు దేశంలో పసిడి ధర పరుగుకు దోహదపడతాయని వారి విశ్లేషణ. బంగారం ధరల్లో బుల్లిష్ ట్రెండ్‌కు ఈ ఏడాది చివరి వరకు అవకాశం ఉందని కామ్‌ట్రెండ్జ్‌ రీసెర్చ్‌ కోఫౌండర్‌, సీఈఓ జ్ఞాన్‌శేఖర్‌ త్యాగరాజన్‌ తెలిపారు.

ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.38,302 స్థాయిలో ఉండగా, కామెక్స్‌లో ఔన్స్‌ ధర 1,506 డాలర్లుగా ఉంది. ఈ ఏడాది ఇప్పటికే పసిడి ధరలు 15 శాతం పెరిగినట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కమోడిటీ రీసెర్చ్‌) నవనీత్‌ దమానీ తెలిపారు. అమెరికా-చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న వాణిజ్య యుద్ధ వాతావరణం చల్లబడితే ధరల్లో కొంత దిద్దుబాటుకు అవకాశం ఉంటుందని నవనీత్ పేర్కొన్నారు.

gold rate

వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,760, విజయవాడలో రూ.38,670, విశాఖపట్నంలో రూ.39,790, ప్రొద్దుటూరులో రూ.38,850, చెన్నైలో రూ.38,480గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,880, విజయవాడలో రూ.35,850, విశాఖపట్నంలో రూ.36,600, ప్రొద్దుటూరులో రూ.35,580, చెన్నైలో రూ.36,850గా ఉంది.

ఇక వెండి కిలో ధర హైదరాబాదులో రూ.46,500, విజయవాడలో రూ.48,200, విశాఖపట్నంలో రూ.47,700, ప్రొద్దుటూరులో రూ.47,700, చెన్నైలో రూ.50,400 వద్ద ముగిసింది.

- Advertisement -