క్రికెట్ ఆస్ట్రేలియా…వార్నర్ సరికొత్త రికార్డు

504
david warner
- Advertisement -

ఆడిలైడ్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో విధ్వంసం సృష్టించాడు డేవిడ్ వార్నర్‌. తన బర్త్ డే రోజు లంక బౌలర్ల పాలిట సింహాస్వప్నంగా మారిన వార్నర్ టీ20ల్లో ఆసీస్ తరపున సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

కేవలం 56 బంతుల్లో 10 ఫోర్లు,4 సిక్సర్లతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వార్నర్‌తో పాటు ఫించ్(64),మక్స్‌వెల్(62) రాణించడంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 233 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యచేదనలో శ్రీలంక 99 పరుగులకే పరిమితమైంది.

ఇక ఈ మ్యాచ్ ద్వారా వార్నర్ సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. పుట్టినరోజు నాడు సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు యువరాజ్ (60) పేరిట ఉండగా దానికి అధిగమించాడు వార్నర్.

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ చివరి బంతికి సెంచరీ మార్క్‌ని అందుకున్న మూడో క్రికెటర్‌గా వార్నర్ నిలిచాడు. ఇప్పటి వరకూ మార్టిన్ గప్తిల్, జేపీ కట్జే మాత్రమే ఇలా సెంచరీ చేశారు.

ఆసీస్ తరపున వన్డే, టీ20, టెస్టులు మూడు ఫార్మాట్‌లలో సెంచరీ చేసిన రెండో క్రికెటర్ వార్నర్. ఇప్పటివరకు షేన్ వాట్సన్ మాత్రమే ఈ ఘనత సాధించాడు.

- Advertisement -