హరితహారం మహాత్తర యజ్ఞం: స్పీకర్ పోచారం

594
speaker pocharam
- Advertisement -

తెలంగాణకు హరితహారం మహత్తరమైన యజ్ఞం అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. గ్రీన్ చాలెంజ్‌లో బాగంగా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇచ్చిన సవాల్‌ని స్వీకరించి ఇవాళ శాసనసభ ఆవరణలో ఆరు మొక్కలను నాటారు పోచారం శ్రీనివాసరెడ్డి. రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు , ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఇన్ఫోటెక్ చైర్మన్ మోహన్ రెడ్డికి గ్రీన్ ఛాలెంజ్‌ సవాల్‌ని విసిరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పోచారం….రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే177 కోట్ల మొక్కలను నాటామని చెప్పారు. రాష్ర్టవిస్తీర్ణంలో 33 శాతం అడవులను పెంచడమే లక్ష్యమని తెలిపిన పోచారం ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ మంచి వర్షాలు కురుస్తాయని చెప్పారు.

గ్రీన్ చాలెంజ్ మంచి కార్యక్రమం. దీనిని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ను అభినందిస్తున్నానని చెప్పారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.చెట్లు లేకపోతే మనుషులకు మనుగడ లేదన్నారు. ప్రతి మనిషికి ఏడాదికి 300 కిలోల ఆక్సిజన్ అవసరం…. ప్రతి చెట్టు ఏడాదికి సుమారు 100 కిలోల ఆక్సిజన్ అందిస్తుందని తెలిపారు.

స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తున్నవి చెట్లు… అటవీప్రాంతాలలోని ఖాళీ ప్రదేశాలలో పండ్ల చెట్లను పెంచుతున్నారు…దేశమంతటా వర్షాలు పుష్కలంగా కురుస్తుంటే, అడవులు, చెట్లు లేకపోవడంతో మంజీర నది పరివాహకంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి…మొక్కలు నాటడంతో పాటు వాటిని బతికించడం ఎంతో ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు, గ్రీన్ చాలెంజ్ టీం మెంబర్ రాఘవ, శాసనసభ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -