బిగ్ బాస్ 3..ఎపిసోడ్ 96 హైలైట్స్‌

609
big boss 3
- Advertisement -

బిగ్ బాస్ 3 తెలుగు రియాల్టీ షో 96వ ఎపిసోడ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ ఎపిసోడ్‌లో ఓట్ల వేటలో విజేతగా శ్రీముఖి నిలిచింది. శ్రీముఖి డార్క్ లవ్ స్టోరీ ఈ ఎపిసోడ్‌కే హైలైట్ అయ్యింది. వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే సూపర్ హిట్ సాంగ్‌కి రచ్చ రేపే స్టెప్పులు వేశారు కంటెస్టెంట్స్. వంటగదిలో బాబాతో సవాల్ చేసి వీపు వాయించేసింది శ్రీముఖి.

ఇవాళ్టి టాస్క్‌లో భాగంగా కంటెంస్టెంట్స్‌ ఫైనల్‌కి ఎందుకు అర్హులు అన్నది వివరించాల్సి ఉంటుందని చెబుతు వాళ్లకు తెల్లటి బట్టలతో పాటు చేతిలో కలర్ బౌల్ ఇచ్చారు. ఒకవేళ ఫైనల్‌కి అర్హత ఉంది అంటే వాళ్లపై రంగు చల్లాల్సిన అవసరం లేదని లేకుంటే రంగు చల్లాలని టాస్క్ విధించారు. తొలుత బాబా భాస్కర్ రంగు బౌల్ తీసుకుని అలీపై చల్లారు. తనను తప్పుగా అర్ధం చేసుకుని ఆరోపణలు చేశావు అందుకే ఈ రంగు వేయాల్సి వచ్చిందన్నారు బాబా. తర్వాత శివజ్యోతిపై రంగుచల్లిన శ్రీముఖి రీజన్‌ ఏంటో చెప్పేసింది. నీ పద్దతి బాలేదు అంటూ వరుణ్‌పై రంగు చల్లింది శివజ్యోతి.

శ్రీముఖి టాప్ 5లో ఉండటానికి అర్హత ఉందని అందుకే ఆమెపై రంగు చల్లడం లేదన్నారు అలీ. ఇక వరుణ్ సందేశ్ సైతం బాబా భాస్కర్‌పై రంగు చల్లలేదు. ఆయనకు ఫైనల్‌కి వెళ్లే అర్హత ఉందన్నారు. బాబా,శ్రీముఖి ఇద్దరిపై రంగు పడకపోవడంతో ఎవరో ఒకరే గెలవాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పగా వరుణ్…బాబాపై రంగు చల్లేశాడు. దీంతో ఈ టాస్క్‌లో గెలిచిన శ్రీముఖి ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశాన్ని పొందింది.

తమ జీవితంలో జరిగిన డార్క్ సీక్రెట్‌ను చెప్పాలని,ఒంటరిగా ఫీల్ అయి బాధ పడిన సందర్భాలను షేర్ చేసుకోవాలని ఇంటిసభ్యులకు మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. తొలుత వరుణ్ తన గర్ల్ ఫ్రెండ్‌తో గోవా వెళ్లడం….ఆమెను వెరేవాళ్లు ఏడిపిస్తుంటే ఫైట్ చేశానని చెప్పారు.

తనది ఓ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అంటూ తన ప్రేమకథను చెప్పుకొచ్చింది శ్రీముఖి. యాంకర్‌గా కెరీర్‌ స్టార్ట్ చేశా.. ఆ షో పెద్ద హిట్ అయ్యింది. అటు పర్శనల్ లైఫ్ కూడా అతనితో హ్యాపీగా సాగుతుంది. అంతా ఓకే అనుకున్న సందర్భంలో విభేదాలు రావడంతో మా రిలేషన్ షిప్ దెబ్బతింది. అగ్లీ బ్రేకప్ ఫేస్ చేశా. అది ఎంత అగ్లీ అంటే చచ్చిపోదాం అనే పరిస్థితి వరకూ వచ్చింది అంటూ కన్నీళ్లు పెట్టించింది. మొత్తంగా బిగ్ బాస్ 96వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.

- Advertisement -