- Advertisement -
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 21న జరిగిన విషయం తెలిసిందే. నేడు ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపధ్యంలో అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలకు గానూ 3,239 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. 1168 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మహారాష్ట్ర, హర్యానా సహా దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల ఫలితాలు సైతం ఇవాళ వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు అధికారులు, పోలీసులు భారీ బందోమస్తు ఏర్పాటు చేశారు. కాగా మహారాష్ట్ర, హర్యానాలో మరోసారి బీజేపీ అధికారంలోకి రానుందని సర్వేలు తేల్చాయి.
- Advertisement -