కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు బెయిల్  

332
D K Shivakumar
- Advertisement -

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 3వ తేదిన డికె శివ కుమార్ ను అరెస్ట్ చేసి తీహార్ జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. గతంలో ఆయన తరపు న్యాయవాదులు పలుమార్లు బెయిల్ అడిగిన కోర్టు తిరస్కరించింది. తాజాగా అయన మరోసారి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది. రూ.25 లక్షల పూచీకత్తుతో శివకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బెయిల్ ఇస్తూ డికె శివకుమార్ పలు కండిషన్ లు పెట్టింది కోర్టు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు నిర్దేశించింది. డీకే శివకుమార్ కు బెయిల్ మంజూరు కావడంతో కర్ణాటక కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు

- Advertisement -