రాగల 24 గంటల్లో…బ్లాక్ బస్టర్ హిట్- దేవిశ్రీ ప్రసాద్

408
ragala 24 gantallo
- Advertisement -

సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం “రాగల 24 గంటల్లో”. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పై ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాత శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం డి ఐ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి నవంబరులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. కాగా ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్ ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రగు కుంచె, పాటల రచయిత శ్రీమణి, మాటల రచయిత కృష్ణభగవాన్, నటుడు రవి వర్మ, కెమెరామెన్ అంజి, లైన్ ప్రొడ్యూసర్ యమ్ యస్ కుమార్, చిత్ర నిర్మాత శ్రీనివాస్ కానూరు, దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. ఢమరుకం సినిమానుండి శ్రీనివాస్ రెడ్డి గారితో మంచి బాండింగ్ ఏర్పడింది. అప్పటినుంచి ఆయన మా ఫ్యామిలీ లో ఒక మెంబర్ అయిపోయారు. మంచితనానికి మారుపేరు ఆయన. ఈ ప్రమోషనల్ సాంగ్ నేను రిలీజ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. టీజర్, ట్రయిలర్ చూశాను.. చాలా చాలా బాగుంది. ఒక సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత అందరిది. దానివల్ల నిర్మాతకు చాలా హెల్ప్ అవుతుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో ఎఫర్ట్స్ పెట్టి సినిమా చేశారు. ప్రతి ఒక్కరు చాలా కాన్ఫిడెంట్ గా వున్నారు. ముఖ్యంగా నిర్మాత శ్రీనివాస్ కానూరు గారు మంచి ఫ్యాషన్ ఉన్న నిర్మాత. అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవుతుంది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. అవ్వాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రమోషనల్ సాంగ్ చేయడానికి ఇన్స్పిరేషన్ దేవిశ్రీప్రసాద్. అడగ్గానే దేవి వచ్చి మా సాంగ్ లాంచ్ చేసినందుకు థాంక్స్. రగు కుంచె చాలా ట్రెండీగా ఈ పాటని కంపోజ్ చేశారు. కృష్ణభగవాన్ స్క్రిప్ట్ నచ్చి మనసు పెట్టి మంచి డైలాగ్స్ రాశారు. అందరూ గర్వపడే విధంగా సినిమా చేశాను. కెమెరా, మ్యూజిక్ ఈ సినిమాకి రెండు కళ్ళు. అంజి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. రగు అద్భుతమైన పాటలు, రీ-రికార్డింగ్ చేశాడు. నన్ను నమ్మి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కష్టపడి పనిచేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా నిర్మాత శ్రీనివాస్ కానూరు మంచి అభిరుచిగల నిర్మాత. ప్యాషన్ తో ఈ సినిమాని కాంప్రమైజ్ అవకుండా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆదరించి సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

నిర్మాత శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ.. బేసిగా నాది ట్రావెల్ బిజినెస్. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. అన్ని సినిమాలు చూస్తాను. శ్రీనివాస్ రెడ్డి మంచి స్నేహితుడు. నా మొదటి సినిమా శ్రీనివాస్ రెడ్డి లాంటి మంచి డైరెక్టర్ తో నిర్మించడం నా అదృష్టం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ని నమ్మి ఈ సినిమా చేశాను. వారు అగ్రిమెంట్స్ లేకుండా నా కోసం ప్రేమతో ఈ సినిమాకి వర్క్ చేశారు. అందర్నీ గౌరవించాను. మంచి సినిమా చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. చిన్నపిల్లలు నుండి పెద్దవారి వరకు అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మా పాట రిలీజ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది.. డి.ఐ జరుగుతోంది. నవంబర్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాను.. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె మాట్లాడుతూ.. సంగీత సామ్రాజ్యంలో 20ఏళ్లుగా మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న దేవిశ్రీప్రసాద్ లాంటి గొప్ప వ్యక్తి మా ప్రమోషనల్ సాంగ్ లాంచ్ చేయడం మా సినిమా పెద్ద విజయం అయినట్లే. ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి. ప్రతీ పాట చాలా కేర్ తీసుకొని చేశాం. ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డిగారికి నా థాంక్స్. సినిమాని ఆదరించి మంచి హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

పాటల రచయిత శ్రీమణి మాట్లాడుతూ.. 100%లవ్ నుండి దేవిశ్రీప్రసాద్ గారితో నా జర్నీ కొనసాగుతుంది. అలాంటి వ్యక్తి నేను రాసిన ఈ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. నా కెరియర్ బిగినింగ్ నుండి నను శ్రీనివాస్ రెడ్డిగారు ప్రోత్సహిస్తున్నారు. అనుకున్న దానికన్నా పాట చాలా బాగా వచ్చింది. కాన్సెప్ట్ వినగానే చాలా ఫన్నీగా అనిపించింది. డెఫినెట్ గా ఈ చిత్రం అందరికి నచ్చుతుంది.. అన్నారు.

నటుడు, మాటల రచయిత కృష్ణభగవాన్ మాట్లాడుతూ.. శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాకి మాటలు రాయించారు. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఔట్ ఫుట్ బాగా వచ్చింది. నిర్మాత శ్రీనివాస్ ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది చిన్న సినిమా అయినా పెద్ద విజయం సాధిస్తుంది. ఈ సినిమాతో శ్రీనివాస్ రెడ్డి పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ చాలా మంచిపేరు వస్తుంది.. అన్నారు.

నటుడు రవి వర్మ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాను. సత్యదేవ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నా జీవితంలో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది. శ్రీనివాస్ రెడ్డి లాంటి మంచి డైరెక్టర్ ని ఇంతవరకూ చూడలేదు.. అన్నారు.

*సత్యదేవ్, ఈషా రెబ్భ, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ, కృష్ణభగవాన్, టెంపర్ వంశీ, అజయ్, అనురాగ్, రవి వర్మ, రవిప్రకాష్, మానిక్ రెడ్డి, అదిరే అభి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: వై.శ్రీనివాస్ వర్మ, మాటలు: కృష్ణభగవాన్, సంగీతం: రఘు కుంచె, పాటల రచయితలు: భాస్కరభట్ల, శ్రీమణి, డిఓపి: గరుడవేగ అంజి, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: తమ్మిరాజు, ఫైట్స్: విక్కీ, డాన్స్: స్వర్ణ, భాను, లైన్ ప్రొడ్యూసర్: యం. ఎస్. కుమార్, ప్రొడ్యూసర్: శ్రీనివాస్ కానూరు, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: శ్రీనివాస్ రెడ్డి.

- Advertisement -