‘డిస్కోరాజా’తో ‘ప్రతిరోజూ పండగే’

458
Disco Raja Prathiroju pandage
- Advertisement -

పండగలు వచ్చాయంటే చాలు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా అయితే తెలుగు ఇండస్ట్రీలో ఏ పండగ వచ్చినా సరే స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతుంటాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20న రవితేజ చిత్రం డిస్కోరాజా విడుదల కానుంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీపై భారీ అంచనాలున్నాయి. అదే రోజు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ప్రతిరోజూ పండగే కూడా విడుదల కానుంది. మారుతి ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈసినిమాను కూడా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈమూవీ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ‌రోవైపు అదే రోజు బాల‌య్య రూల‌ర్ కూడా విడుద‌ల కానుంది. కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాల‌య్య పోలీస్ ఆఫీస‌ర్‌గా, గ్యాంగ్ స్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. మరి ఈమూడు సినిమాల్లో ఏమూవీ హిట్ అవుతుందో చూడాలి.

- Advertisement -