ముగిసిన అయోధ్య విచారణ.. కానీ తీర్పు..!

428
- Advertisement -

హిందువుల మ‌నోభావాల‌కు కేంద్ర బిందువుగా మారిన అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు విచారణను ముగించింది. దాదాపు 40 రోజుల పాటు ఏకధాటిగా సుప్రీంకోర్టు ఈ కేసును విచారించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యం వహించిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వైరి పక్షాల వాదనలను విన్నది.

ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వాదనలను వింటామని సుప్రీంకోర్టు ప్రకటించినప్పటికీ… ఒక గంట ముందే అంటే 4 గంటలకే విచారణ ముగిసినట్టు ప్రకటించింది. ఇంతకు మించి వినడానికి ఏమీ లేదని తెలిపింది. తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

ram mandir

ఈ కేసులో.. తుది తీర్పు న‌వంబ‌ర్ 17వ తేదీలోగా వెలుబ‌డే అవ‌కాశాలు ఉన్నాయి. చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్ రిటైర్ అయ్యే లోపు అయోధ్య తీర్పు వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు. సుప్రీం ధ‌ర్మాస‌నంలో చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్‌, జ‌స్టిస్ బోడే, చంద్ర‌చూడ్‌, అశోక్ భూష‌ణ్‌, అబ్ధుల్ న‌జీర్‌లు ఉన్నారు.

సీనియ‌ర్ న్యాయ‌వాదులు కే ప‌ర‌శ‌ర‌న్‌,సీఎస్ వైద్య‌నాథ‌న్‌లు.. రామ్‌ల‌ల్లా త‌ర‌పున వాదించారు. న్యాయ‌వాది ఎస్‌కే జైన్.. నిర్మోహి అకాడా త‌ర‌పున వాదించారు. రాజీవ్ థావ‌న్‌, మీనాక్షి అరోరా, శేఖ‌ర్‌న‌ప‌డేలు సున్నీవ‌క్ఫ్ బోర్డు త‌ర‌పున వాదించారు.

- Advertisement -