సీఎం కేసీఆర్ ఆశీస్సులతో చెన్నూరు నియోజకవర్గంలో లక్షా 31 వేల 840 ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు ఎమ్మెల్యే బాల్క సుమన్. జలసౌధలో ఇరిగేషన్ అధికారులు మురళిధర్ రావు, శ్రీనివాస్ రెడ్డి,విష్ణు ప్రసాద్,అజ్మల్ ఖాన్,డీఈఈ రామకృష్ణతో సమావేశమైన సుమన్ ఇందుకు సంబంధించి త్వరలో సర్వే జరగనుందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో నిర్మించే మూడు ప్రతిపాదిత లిఫ్ట్‌లపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను కోరారు. ఈ మూడు లిఫ్ట్ ల ద్వారా 79,470 ఎకరాలకు కొత్త ఆయకట్టు ద్వారా సాగు నీరందనుండగా 52,370 ఎకరాల ఆయకట్టు స్థీరికరణ జరుగుతుందన్నారు.
ప్రతిపాదిత లిఫ్ట్‌లు
()వేమనపల్లి మండలంలోని వెంచపల్లి వద్ద కొత్త లిఫ్ట్‌ని ప్రారంభించనున్నారు. ప్రాణహిత నది నుంచి మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్‌ను లిఫ్ట్ చేయనున్నారు. తద్వారా కొత్తగా కొటపల్లి మండలానికి 18,800 ఎకరాలకు ,వెనేపల్లి మండలానికి 4970 ఎకరాలకు సాగునీరందనుంది.
()అన్నారం బ్యారేజ్ నుండి వచ్చే నీటి ద్వారా కొత్తగా లిఫ్ట్‌ను నిర్మించడంతో 31,252 ఎకరాలకు సాగునీరు అందేలా ప్లాన్ రూపొందించారు. దీని ద్వారా చెన్నూరు మండలంలో 17895 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందడంతో పాటు 20907 ఎకరాల ఆయకట్టు స్ధీరికరణ జరగనుంది. దీంతో పాటు కొటపల్లి మండలంలోని 13357 ఎకరాలకు కొత్తగా సాగునీరు అందనుండగా 9584 ఎకరాల ఆయకట్టు స్ధీరికరణ జరగనుంది.
()సుందిళ్ల బ్యారేజ్ నుంచి వచ్చే నీటి ద్వారా 29,418 ఎకరాలకు నీరందించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి జైపూర్ మండలంలోని 17088 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 9348 ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ జరగనుంది.అలాగే బీమారమ్ మండలంలోని 6280 కొత్త ఆయకట్టుకు నీరందడంతో పాటు 6621 ఎకరాల ఆయకట్టు స్ధీరికరణ జరగనుంది. మందమర్రి మండలంలోని 6050 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 5910 ఎకరాల ఆయకట్టు స్థీరికరణ జరగనుంది.
మొత్తంగా లిఫ్ట్ 1 ద్వారా 18800 ఎకరాలకు,లిఫ్ట్ 2 అన్నారం బ్యారేజ్ ద్వారా 61743 ఎకరాలు,లిఫ్ట్ 3 సుందిళ్ల బ్యారేజ్ ద్వారా 51297 ఎకరాలకు అంతా కలిపి 1,31,840 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టుతో చెన్నూరుకు సాగునీరందనుంది.