బంగారం ధర గత నెలలో 10 గ్రాములకు రూ.40,000 సమీంలోకి చేరింది. దీంతో పోలిస్తే ఇప్పుడు పసిడి ధర ఏకంగా రూ.2,200 దిగొచ్చింది. వెండి ధర మాత్రం పెరిగింది. ఎంసీఎక్స్ మార్కెట్లో కేజీ వెండి ధర 0.19 శాతం పెరుగుదలతో రూ.45,258 స్థాయికి చేరింది. గత రెండు సెషన్లలో వెండి ధర కూడా మొత్తంగా రూ.800 పడిపోయింది.
వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,300, విజయవాడలో రూ.37,900, విశాఖపట్నంలో రూ.39,640, ప్రొద్దుటూరులో రూ.37,750, చెన్నైలో రూ.38,250గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,510, విజయవాడలో రూ.35,100, విశాఖపట్నంలో రూ.39,960, ప్రొద్దుటూరులో రూ.34,950, చెన్నైలో రూ.36,600గా ఉంది.
వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,300, విజయవాడలో రూ.46,800, విశాఖపట్నంలో రూ.46,800, ప్రొద్దుటూరులో రూ.46,400, చెన్నైలో రూ.49,300 వద్ద ముగిసింది. భారత్లో ఈ సంవత్సరం బంగారం ధర క్రమంగా 20 శాతం పెరుగుతూనే ఉంది. ఇటీవల ధరల్లో తగ్గుదల ఉండటంతో దీపావళికి పసిడి కొనుగోళ్లు పెరగొచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి.