తెలుగు ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కిన శివ తర్వాత యూత్ ను ఆకట్టుకున్న సినిమా అర్జున్ రెడ్డి. ఈమూవీ విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తీసుకువచ్చింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈసినిమా భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఈమూవీతో విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
ఈమూవీ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో హిందీలో అర్జున్ రెడ్డి రిమేక్ తెరకెక్కించాడు. అక్కడ కూడా ఈమూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన మరో హిందీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈమూవీకి సంబంధించిన వివరాలనున చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇటివలే ఓ ఇంటర్యూలో పాల్గోన్న సందీప్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బాలీవుడ్ లో సినిమా తీసిన తర్వాత తెలుగులో విజయ్ దేవరకొండతో మరో సినిమాను తీయనున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని సమాచారం.