బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

1007
Srireddy Byreddy
- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది నటి శ్రీరెడ్డి. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా కొంత మందిపై ఆమె కామెంట్లు చేస్తుంది. ఈమధ్య శ్రీరెడ్డి సినిమా వాళ్లపై కాకుండా రాజకీయ నాయకులపై కూడా కామెంట్లు చేస్తుంది. ఇటివలే నగరి ఎమ్మెల్యే రోజా పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైసీపీ యువనాయకుడిపై ఆమె కన్ను పడింది.

యూత్ లీడర్, వైసీపీ నందికొట్కూర్ ఇంఛార్జ్ బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఒక్కరోజు భార్యగా ఉన్నా చాలని, ఆ తరువాత చనిపోయినా ఫర్వాలేదంటూ ఫేస్ బుక్ అకౌంట్ లో శ్రీరెడ్డి చేసిన ఓ పోస్ట్.. ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా విభాగం నాయకులు పెద్ద ఎత్తున ఆమెను ట్రోల్ చేస్తున్నారు. తమ నాయకుడిపై ప్రేమను వ్యక్తం చేయడాన్ని పలువురు నాయకులు స్వాగతిస్తుండగా.. మరి కొందరు ఆయనను వదిలేయ్ తల్లో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

srireddy

- Advertisement -