ఆర్టీసీ విలీనం ఎట్టి పరిస్థితుల్లో జరగదుఃమంత్రి వేముల

413
Vemula-Prashanth-reddy
- Advertisement -

ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎట్టి పరిస్థితుల్లో జరగదు అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు అక్కడ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయకుండా ఇక్కడ మాత్రం ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ నీచ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల కు పెంచిన దానికంటే ఆర్టీసీ ఉద్యోగులు జీతాలు ఎక్కువ పెంచాం.44 శాతం ఫిట్మెంట్,16 శాతం ఐ.ఆర్ ఎవ్వరికీ ఇవ్వలేదన్నారు. 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల అనైతిక డిమాండ్ ని తీర్చడం కంటే 4 కోట్ల ప్రజల అవసరాలు తీర్చడమే ముఖ్యం. ఆర్టీసీ లో సంస్కరణలు తెచ్చి పేద ప్రజలకు మంచి సేవలు అందించి ఆర్టీసీ ని లాభాల బాటలో తేవడమే కేసీఆర్ ఉద్దేశ్యం..కాంగ్రెస్, బీజేపీలు ఆర్టీసీ ఉద్యోగులను రెచ్చగొట్టి వారికి నష్టం చేశారు..ప్రతి పక్షాలు చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు గమనించాలని విజ్నప్తి చేశారు.

- Advertisement -