సినిమా పరిశ్రమలో కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయనేది సాదారణంగా వింటుంటాం. దీనికి హీరోలు, హీరోయిన్స్ ఎవరూ అతీతులు కారని కూడా అంటారు. వారు కూడా పార్టీలకు వెళ్లడం, సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం లాంటివన్ని చేస్తుంటారని టాక్ వినిపిస్తూ ఉంటుంది. అయితే బయటకు చెప్పడానికి మాత్రం ఇష్టపడరు. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఏ తడుముకొకుండా తానకు మద్యం సేవించే అలవాటు ఉందని చెప్పేసింది. ఆ హీరోయిన్ ఎవరేనేగా మీ సందేహం ఇక అసలు విషయంలోకి వెళ్తే..
మంచు లక్ష్మి ఫీట్ అప్ విత్ స్టార్ అనే షో ను చేస్తోంది. ఈ షోలో హీరోయిన్ శృతి హాసన్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కొద్ది కాలంగా సినిమాలకు శృతి దూరమైన సంగతి తెలిసిందే. దానికి కారణం ఆమె అనారోగ్యానికి గురి కావడమే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమే అని తాజాగా శృతి ధ్రువీకరించింది. విపరీతంగా తాగడం వల్లే అనారోగ్యానికి గురయ్యానని ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
`నేను మద్యానికి బానిసనయ్యా. రెండేళ్లు విపరీతంగా మద్యం సేవించా. విస్కీ అంటే నాకు ఇష్టం దాని వల్ల నా ఆరోగ్యం పాడైంది. అనారోగ్యం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అందుకే ఆ సమయంలో సినిమాలకు దూరమయ్యా. ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టానని శృతి తెలిపింది. ఇక తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ నుంచి శృతి ఇటీవలే విడిపోయిన సంగతి కూడా శృతి ఓపెన్‌గా చెప్పేసింది.