- Advertisement -
దక్షిణాఫ్రికాతో టీంఇండియా నేడు రెండో రెండవ టెస్ట్ ఆడనుంది. కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలిచిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, విశాఖ పిచ్ తో పోలిస్తే, పూణే పిచ్ మరింత హార్డ్ గా ఉందని, రివర్స్ సీమ్ కు అనుకూలిస్తుందని భావిస్తున్నామని అన్నాడు.
ఈ కారణంతో హనుమ విహారి స్థానంలో ఉమేశ్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. షమీ, ఉమేశ్ లు ఈ పిచ్ పై మరింత పదునైన బాల్స్ వేయగలరని నమ్ముతున్నామని అభిప్రాయపడ్డాడు. కోహ్లీకి ఇది కెప్టెన్‌గా 50వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం.
- Advertisement -