సిరిసిల్ల.. 30 రోజుల ప్రణాళికపై కేటీఆర్‌ సమీక్ష..

443
ktr
- Advertisement -

రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ బుధవారం ఆకస్మిక పర్యటన చేశారు. సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 రోజుల ప్రణాళిక విజయవంతంగా పూర్తి చేసిన జిల్లా యంత్రంగానికి,సిబ్బందికి,సర్పంచులను కేటీఆర్ అభినందించారు.

ktr help

అలగే గ్రామ ప్రణాళిక విజయవంతంగా పూర్తిచేసినందకు రూ.4 లక్షల వ్యక్తిగత నిధులతో 1200 మంది పంచాయితీ సిబ్బందికి బీమా ప్రీమియం చెల్లిస్తానన్నారు మంత్రి కేటీఆర్. దీనికి సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్‌కు అందించారు. సమావేశ అనంతరం వికలాంగులకు మంత్రి కేటీఆర్‌ ద్విచక్ర వాహనాల పంపిణీ చేశారు

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎగువ మానేరు నుంచి దిగువ మానేరు వరకు మానేరు తీరం వెంబడి మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలి. జిల్లాలోని అన్ని చెరువులు, కాలువల వెంట మొక్కలు నాటాలి. ప్రతి నెల వారం రోజుల పాటు ప్రజల సహకారంతో పారిశుద్ధ్యం, పచ్చదనం వంటి కార్యక్రమాలు చేపట్టాలి.

ktr meeting

99 శాతం మిషన్ భగీరథ పనులు పూర్తియనందున ప్రజలందరికీ పరిశుభ్రమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలి. మినరల్ వాటర్ ప్లాంట్లలో, వాటర్ బాటిళ్లలో ఉండే నీటికంటే భగీరథ నీరే స్వచ్ఛమైనదని ప్రజలకు తెలియజెప్పాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు.

- Advertisement -