- Advertisement -
దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పర్వదినాన్ని ప్రజలందురు సుఖసంతోషాలతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
చెడు మీద మంచి విజయం సాధించే రోజు విజయ దశమి అని.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో దేశంలోనే అత్యంత వేగంగా పురోగతి సాధిస్తుందని చెప్పారు.ప్రజా సంక్షేమం , అభివృద్ధి దిశగా ప్రభుత్వం అన్నింటా మరిన్ని విజయాలు సాధించాలని ఈ పర్వదినాన ఆ దుర్గ అమ్మవారిని వేడుకొన్నారు. దసరా పండుగ రాష్ట్ర ప్రజలకు మరిన్ని విజయాలు అందించాలని కోరుకున్నారు.
- Advertisement -