మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఇంద్రారెడ్డి జయంతి వేడుక కార్యక్రమంలో పాల్గొని నగరానికి వెళ్తున్న సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల వద్ద ఆకస్మాత్తుగా ఆగింది. రోడ్డు పై వెళ్తున్న ద్విచక్ర వాహనం ను కార్ ఢీకొన్న సంఘటన లో చేవెళ్ల మండలం దామర గిద్ద గ్రామానికి చెందిన బంటు నర్సిములు అనే వ్యక్తి కాలు నుజ్జు నుజ్జు అయ్యింది.
దీంతో వెంటనే స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధితున్ని 108 అంబులెన్స్ లోకి ఎక్కించే వరకు ఉండి, కాన్వాయ్ లో వస్తున్న చేవెళ్ల ఎస్ ఐ రేణుక రెడ్డి ని క్షతగాత్రునికి ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని అదేశించి అంబులెన్స్ కదిలిన తర్వాత బయలుదేరి వెళ్లారు..
పైలెట్‌గా వస్తున్న ఎస ఐ మంత్రి ఆదేశం తో క్షతగాత్రుని తో పాటు హుటాహుటిన చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు….అనంతరం మంత్రి పి ఏ శ్రీనివాస్ ద్వారా దామర గిద్ద సర్పంచ్ కు ఫోన్ చేసి వివరాలు తెలియజేశారు.