టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.ఈ మూవీ ప్రారంభం అయినప్పటి నుండి పలువివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ‘సైరా’ చిత్రం మరో వివాదంలో ఇరుక్కుంది. తొలుత బయోపిక్ అన్నారని, ఆ తర్వాత కాదంటున్నారంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కానీ పిటిషన్‌ను కొట్టివేస్తు సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బుధవారం మూవీ రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి.
ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సినిమాను చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుల అభీష్టంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించింది. సినిమాను సినిమాలాగే చూడాలని చెప్పింది.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని… విడుదలకు ఒక రోజు ముందు సినిమాను ఆపలేమని తెలిపింది. హైకోర్టు తీర్పుతో మెగా అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.
తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ ‘సైరా’ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కొణెదల ప్రొడక్షన్స్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని సుమారు రూ. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ భారీ చారిత్రాత్మక తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.