డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..

574
Baba Fasiuddin
- Advertisement -

బోరబండా డివిజన్‌లో మూడవ రోజు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు.

Bathukamma Celebrations

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలను పెద్ద ఎత్తున చేపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కి దక్కుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఒకప్పుడు బోరబండ డివిజన్‌లో అభివృద్ధిలో వెనకబడేది కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

Deputy Mayor Baba Fasiuddin

డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. బతుకమ్మ,రంజాన్,క్రిస్మస్ ఇలా కులమతాలకు అతీతంగా పండుగలను బోరాబండలో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జరిపిస్తున్నాను. కొద్దిగా వర్షం వస్తే ఒకప్పుడు నడవడానికి కూడా వచ్చేది కాదు కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు రోడ్లను బాగు చేసుకున్నాం. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున మహిళలు అందరూ కలిసి బతుకమ్మ ఆడేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని బాబా ఫసియుద్దీన్ అన్నారు.

- Advertisement -