గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం `చాణక్య`. బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తిరు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ బ్రహ్మం సుంకర నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. అక్టోబర్ 5న విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో…రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ – “ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ నా స్వంత బ్యానర్‌తో సమానం. నిర్మాతలు ఎంతో ఆప్తులు. ఈ బ్యానర్ నుండి వస్తున్న చిత్రం `చాణక్య`కు చాలా మంచి స్పందన వస్తుంది. టీజర్, ట్రైలర్ అన్నీ మెప్పిస్తున్నాయి. సినిమా ప్రేక్షకుల అంచనాలను మించేలా ఉంటుంది. డైరెక్టర్ తిరు మన తెలుగువాడే. ఆయన నిర్మాతలతో కలిసి సినిమాను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. వైవిధ్యమైన చిత్రాలను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరిస్తాననే నమ్మకంతో ఉన్నాం. విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల మంచి మ్యూజిక్‌ను అందించారు. ఫస్టాఫ్ సరదాగా.. సెకండాఫ్‌లో మంచి యాక్షన్ పార్ట్ ఉంటుంది. అందరినీ మెప్పించేలా సినిమా ఉంటుంది“ అన్నారు.
ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ – “సినిమా చాలా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను“ అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మాట్లాడుతూ – “ఇది చాలా పెద్ద అవకాశం. గోపీచంద్, తిరుగారితో పనిచేయడం హ్యపీగా ఉంది. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్తో పనిచేయడం హ్యాపీగా ఉంది“ అన్నారు.
అబ్బూరి రవి మాట్లాడుతూ – “ఇదొక స్పై థ్రిల్లర్. డైరెక్టర్ తిరుగారు సినిమాను అద్భుతంగా తీశారు. సినిమాను చూసి డెఫనెట్‌గా మంచి సినిమా అవుతుంది. మంచి దేశభక్తి భావనను కలిగించే సినిమా ఇది“ అన్నారు.డైరెక్టర్ తిరు మాట్లాడుతూ – “గోపీచంద్‌గారు సరికొత్త పాత్రలో నటించారు. ఆయన ఫేవరెట్ సినిమాల లిస్టులో ఈ సినిమా కూడా ఉంటుంది. అక్టోబర్ 5న విడుదలవుతున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ మంచి సంగీతాన్ని బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. వెట్రిగారు చాలా మంచి విజువల్స ఇచ్చారు. అబ్బూరి రవిగారు అద్భుతమైన డైలాగ్స్ రాశారు. అలాగే రామజోగయ్యశాస్త్రిగారు చాలా మంచి పాటలను రాశారు. సినిమా ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది. గోపీచంద్‌గారు చాలా హార్డ్ వర్క్ చేసిన చిత్రమిది“ అన్నారు.
రాజేష్ కతార్ మాట్లాడుతూ – “నేను తెలుగు సినిమాల్లో నటించాలని ఎదురు చూస్తున్న తరుణంలో నాకు దక్కిన అవకాశమిది. చాణక్య సినిమాతో నేను గోపీచంద్‌గారిని కలవడం, ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఖురేషి పాత్రలో కనపడతాను. తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. అక్టోబర్ 5న సినిమా విడుదలవుతుంది“ అన్నారు.
అనీల్ సుంకర మాట్లాడుతూ – “గోపీచంద్‌గారితో మా బ్యానర్లో సినిమాను చేయడం హ్యాపీగా ఉంది. ఆయన్ని సరికొత్త కోణంలో ఈ సినిమాలో చూపిస్తున్నాం. డైరెక్టర్ తిరుగారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. వెట్రిగారు, విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల, హీరోయిన్ మెహరీన్ సహా ఎంటైర్ యూనిట్‌కు థ్యాంక్స్. అక్టోబర్ 5న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది“ అన్నారు.
గోపీచంద్ మాట్లాడుతూ – “నా నుండి ప్రేక్షకులు ఎలాంటి ఎలిమెంట్స్‌ను కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. మంచి ఫైట్స్, డైలాగ్స్ ఉన్నాయి. డైరెక్టర్ తిరుగారు ఓ హీరోను ఎలా చూపించాలో అలా చూపించారు. అబ్బూరి రవిగారు చాలా మంచి డైలాగ్స్ రాశారు. పాటలు కూడా మంచి స్పందన వస్తుంది. విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అనీల్ సుంకరగారికి సినిమాలంటే ఎంతో ఫ్యాషన్. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. మీ ప్రేమను అక్టోబర్ 5న తిరిగి అందిస్తాను“ అన్నారు.