ప్రవాస తెలుగు వాళ్లు,ముఖ్యంగా టాక్(TAUK) సభ్యులపై ప్రశంసలు గుప్పించారు ఎంపీ సంతోష్ కుమార్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని లండన్‌లో ప్రచారం చేయడం అద్భుతమని…ఎంతో మంది స్పూర్తిగా నిలిచారని ట్విట్టర్ వేదికగా కొనియాడారు.హరితహారం కార్యక్రమం ఖండాంతరాలకు వ్యాపించిందని.. ప్రతిఒక్కరు ప్రవాసీయుల స్పూర్తిగా హరితహారం యజ్ఞంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి ప్రవాస తెలుగు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
వీలైనంత వరకు ప్రవాసులల్లో చేనేత పై అవగాహన కలిపించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేతవస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని ఈ సందర్భంగా అనిల్ కుర్మాచలం కోరారు. అంతేగాదు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ జోగినపల్లి చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రవాస తెలుగువారిపై ప్రశంసలు గుప్పించారు ఎంపీ సంతోష్.
Inspiring enthusiastic souls overseas too. It gives me immense pleasure as @tauk_official @anil_trs @pavikandipavi have taken #GreenIndiaChallenge to London,UK. When it travelled many a miles, how can we lag behind. Pull your socks up and do your part in #HarithaHaram. pic.twitter.com/JeAqG4HgkZ
— Santosh Kumar J (@MPsantoshtrs) September 30, 2019