అక్టోబర్ 2 కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే చిరు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ మూవీ తర్వాత చిరు నెక్ట్స్ ప్రాజెక్టుపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సైరా ప్రమోషన్‌లో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు చిరంజీవి. త్రివిక్రమ్ తనతో సినిమా గురించి ఒక లైన్ చెప్పాడని ప్రస్తుతం వర్క జరుగుతోందని, ఆ సినిమా వంద శాతం కామెడీ ఎంటర్‌టైనర్ అన్నారు.
ఇక త్రివిక్రమ్ సినిమా అంటే హీరో ఖచ్చితంగా కామెడీ చేయాల్సిందే. ఇక హాస్యాన్ని పండించడంలో చిరు నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో చిరు-త్రివిక్రమ్ కాంబోలో కామెడీ ఎంటర్‌టైనర్ రానుండటం మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే అంశమే.
సైరా తర్వాత చిరు…కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

