వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కారు కొంటే బైక్ ఫ్రీ అని మధ్యప్రదేశ్‌లోని ఓ టాటా మోటార్స్ కంపెనీ ప్రకటించింది. బంపర్ బొనాంజ ఆఫర్ కింద కారు కొంటే బైక్ ఫ్రీగా పొందే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించారు ఓ టాటా మోటార్స్ డీలర్.
నెక్సన్, టియాగో, టిగోర్ మోడల్స్‌లో ఏం కొన్నా కూడా హోండా స్కూటర్ ఒకటి ఉచితంగా ఇస్తున్నారు. ఈనెల 30 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే కార్ల ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో పాటు బైక్ ఫ్రీ అనే సరికి వినియోగదారులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే ఆటో మొబైల్ రంగం సంక్షోభంలో కూరుకుపోవడంతో పలు కార్ల కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొన్నికార్లు ధరలు తగ్గించడంతో పాటు వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టాటా కంపెనీ వివిధ కార్ల అమ్మకాలపై రూ. 1.5 లక్షల వరకు తగ్గించింది. దీని ఆధారంగా ఈ ఢీలర్ సరికొత్తగా బైక్ ఆఫర్ పెట్టి విక్రయాల జోరు పెంచేందుకు చర్యలు చేపట్టారు. దీంతో స్ధానికంగా వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది.