- Advertisement -
అబద్దాలు చెప్పడం,మోసం చేయడం ఉత్తమ్ కుమార్ నైజమని మండిపడ్డారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. హుజుర్‌నగర్‌లో మీడియాతో మాట్లాడిన కర్నె ప్రభాకర్ ..ఈ ఎన్నికలు అభివృద్ధి కి, అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ కు మధ్య జరుగుతున్న ఎన్నిక అన్నారు.
హుజుర్‌నగర్ ప్రజలంతా అభివృద్ధికే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు.గ్రామ గ్రామాన టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారు…..ఉత్తమ్ పిచ్చి ప్రేలాపణలు మానుకోవాలన్నారు. హుజుర్ నగర్ ప్రజలను ఉత్తమ్ అవమనపరుస్తున్నారని….టీఆర్ఎస్ గెలిస్తే హుజుర్‌నగర్ అభివృద్ధికి ముఖ ద్వారంగా నిలుస్తుందన్నారు.
ఉత్తమ్ ను నమ్ముకున్నందుకు హుజుర్‌నగర్ ప్రజలు అభివృద్ధి కి ఆమడ దూరంలో ఉన్నారని….. టీఆర్ఎస్ గెలిస్తే హుజుర్ నగర్ ప్రజలకు లాభం…. ఉత్తమ్ గెలిస్తే ఆయన కుటుంబానికి లాభం… ప్రజలు ఆలోచన చేయాలన్నారు.
- Advertisement -