తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ రోజు యాదాద్రిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. యాదాద్రి మహా దివ్య క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్నది. సీఎం కేసీఆర్ సంకల్పం ఎంత గొప్పదో యాదాద్రి పునర్నిర్మాణం చూస్తే అర్థమైతుంది. యాదాద్రి నిర్మాణమనేది ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి అన్నారు.
ఇక అనుకున్నస్థాయి కంటే వర్షాలు ఎక్కువ పడటంతో సాగు విస్తీర్ణం పెరిగి రైతులు సంతోషంగా ఉన్నారు. యాదాద్రి పునర్నిర్మాణం ఎంత మహాద్భుతమైందో, తెలంగాణలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అంతే మహత్తరమైనవి.దశాబ్ధ కాలంగా కరువుతో కొట్టుమిట్టాడుతున్న యాదాద్రి జిల్లా ప్రాంతం, గందమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లతో త్వరలో గోదావరి జాలు పారబోతుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.