లక్ష్యం ఒక్కటే.. స్వాతంత్య్రం.. ‘సైరా’ ట్రైలర్‌ 2

429
- Advertisement -

టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కిస్తున్నా సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న సైరా సినిమా కూడా ఈ కోవకు చెందినదే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సాగే ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 250 కోట్లతో నిర్మిస్తున్నారు చిరు తనయుడు రాంచరణ్‌. సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sye-Raa-Trailer-2

చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 18న విడుదల చేయగా.. యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. ట్రైలర్ చూసి విమర్శకులు సైతం మెగాస్టార్‌కు ఫిదా అవుతున్నారు. అటు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా ట్రైలర్ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు. బాలీవుడ్ టూ టాలీవుడ్ వరకు అంతా చిరంజీవి నటన చూసి పడిపోతున్నారు. సైరా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 34 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోన్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలోని యుద్ధ సన్నివేశాలను బ్యాటిల్ ఫీల్డ్ ట్రైలర్‌లో చూపించారు. ఇందులో చిరు చెప్పె డైలాగులు,బ్రిటీష్‌ వారితో చేసే యుద్ద పోరాటాలు చిత్రంపై భారీ అంచనాలు పెంచుతోంద. మరి అలస్యం ఎందుకు మీరూ ఈ ట్రైలర్‌ ఓ లుక్కేయండి.

- Advertisement -