స్వగృహానికి వేణు మాధవ్ భౌతికకాయం

823
Venu Madhav House
- Advertisement -

ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ మృతదేహాన్ని యశోద ఆసుపత్రి నుంచి కాసేపటి క్రితమే మౌలాలి లోని తన స్వగృహానికి తరలించారు. ఈసందర్భంగా పలువురు ప్రముఖులు వేణు మాధవ్ పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. వేణు మాధవ్ పార్ధివదేహానికి నటులు శివాజీరాజా, అలీ, ఉత్తేజ్, జీవిత రాజశేఖర్ లు నివాళులర్పించారు.

Venu Madhav Dead Body

ఇక రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ లోని ఫిలీం ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నారు. తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి, పలువురు టీడీపీ నేతలు వేణు మాధవ్ స్వగృహంలో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.

- Advertisement -