హైదరాబాద్ గోల్కొండ పీఎస్ పరిధిలోని పలు సూపర్ మార్కెట్లలో దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న దొంగలను గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే గోల్కొండ పిఎస్ పరిధిలోని ఓ ఘరానా దొంగ రిలయన్స్ మార్ట్ మరియు బ్రాండ్ ఫ్యాక్టరీలో గత నెలలో దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్నాడు.
ఈ దొంగను సీసీ కెమెరాల ఆధారంగా రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రిలయన్స్ మార్ట్లో దొంగతనం చేసిన 35 సెల్ఫోన్లు స్వాధినం చేసుకున్నారు పోలీసులు.వాటి విలువ 12 లక్షల 70 వేల రూపాయలు ఉంటుందని వెస్ట్ జోన్ డిసిపి శ్రీనివాస్ తెలిపారు.
అలాగే బ్రాండ్ ఫ్యాక్టరీలో కూడా చొరబడి లక్షా ఎనభై వేల రూపాయలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇతని వద్ద నుంచి రెండు మల్స్ లలో దొంగతనానికి సంబంధించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి A R శ్రీనివాస్ తెలిపారు.