సైరా సెన్సార్‌పూర్తి..రన్‌ టైం ఎంతో తెలుసా

910
syeraa censor
- Advertisement -

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది.

తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది సైరా. సింగిల్ కట్ లేకుండా యు/ఏ సర్టిఫికేట్ పొందింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సైరా సూపర్బ్ అని తెలిపినట్లు సమాచారం. సైరా పర్ఫెక్ట్ పిరియాడిక్ డ్రామా అని రన్ టైం 2 గంటల 45 నిమిషాలు ఉంటుందని సెన్సార్ సభ్యులు తెలిపారు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించగా హిందీతో పాటు దక్షిణాదితో పాటు అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి,పవన్ కళ్యాణ్‌తో పాటు మెగా హీరోలు హాజరుకావడంతో మరింత హైప్ క్రియేట్ అయింది. మరి సైరాతో చిరు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచిచూడాలి.

- Advertisement -