హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం గద్దలకొండ గణేష్. చిత్రం విడుదలకు ముందు సినిమా టైటిల్ ను మారుస్తున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. వాల్మీకి టైటిల్ పై బోయ సామాజికవర్గం అభ్యంతరం వ్యక్తం చేయడంతో టైటిల్ని మార్చారు.
గద్దలకొండ గణేష్ గా పేరు మార్చుకున్న వరుణ్ తేజ్ వాల్మీకి ఫస్ట్ టాక్ వచ్చేసింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
సినిమా సూపర్ హిట్ అంటూ ట్వీట్ చేయగా వరుణ్ తేజ్ తన అద్భుత నటనతో ఇరగదీశాడని చెబుతున్నారు. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ నటన, మేనరిజం, డైలాగ్ డెలివరీ సూపర్బ్ అంటూ పేర్కొంటున్నారు. దర్శకుడు హరీష్…గద్దలకొండ గణేష్గా హిట్ కొట్టాడని మరికొంతమంది చెబుతున్నారు.
హరీష్ శంకర్ రాసిన డైలాగులు బాగా పేలాయని…తెలంగాణ యాసలో మాస్ డైలాగులు సూపర్బ్ అని చెబుతున్నారు. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో బలమని చెబుతున్నారు. ఫస్టాఫ్ చాలా బాగుందని, ఇంటర్వెల్ బ్లాక్ ట్విస్ట్ అదిరిపోయిందని ట్వీట్లు చేస్తున్నారు.