ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున మళ్లీ వివాదంలో ఇరుక్కున్నారు. నాగార్జునకు సంబంధించిన పోలంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలంలో కేశంపేటలోని నాగార్జునకు ఫామ్ హౌజ్ ఉంది.
40 ఎకరాల క్షేత్రంలో సేంద్రీయ పంటలు పండించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. ఈ విషయంపై నిపుణులను అక్కడకు పంపారు. అయితే పొలంలోకి వెళ్లిన తర్వాత ఓ ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన ఈ మృతదేహాన్ని వారు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఈవిషయాన్ని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది గుర్తించారు. కొన్ని నెలల కిందటే చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. రేపు అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. కాగా గత ఏడాది కూడా నాగ్ పొలంలో విషాదం చోటుచేసుకుంది.
ఇదే పొలంలో గత ఏడాది జూన్ లో భార్యాభార్తలైన కూలీలు కరెంట్ షాక్‌తో చనిపోయారు. ఇప్పుడు మరోసారి ఇలా మృతదేహం కనిపించడంతో నాగార్జున కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో కూడా గతంలో ఇద్దరు వ్యక్తులు మరణించిన సంగతి తెలిసిందే.