భారీగా తగ్గనున్న టీవీల ధరలు..ఎందుకో తెలుసా?

525
Xiaomi-LED-TV
- Advertisement -

మరికొద్ది రోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా ఎల్ ఈడీ టీవీల ధరలు భారీగా తగ్గముఖం పట్టనున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీవీలు తయారు చేసుందుకు వాడే టీవీ ప్యానెల్ ను దిగుమతి చేసుకోవడానికి కస్టమ్స్ డ్యూటీని 5 శాతానికి తగ్గిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

గతంలో ఈ పరికరాలపై 7.5 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి పెంచారు. దాన్ని ఇప్పుడు భారీగా తగ్గించారు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటితోపాటు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు(pcb), ఫిల్మ్ చిప్‌లపై కూడా దిగుమతి సుంకాన్ని రద్దు చేశారు. ఎల్ఈడీ, ఎల్‌సీడీ టీవీల తయారీలో ఓపెన్ సెల్ ప్యానెళ్లు అతి ముఖ్యమైనవి. టీవీ తయారీలో సగం ఖర్చు దీనిపైనే వెచ్చించాల్సి ఉంటుంది. అందువల్ల టీవీ రేట్లు భారీగా తగ్గనున్నాయి.

- Advertisement -