తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ లో భారీగా వర్షపాతం నమోదైంది. ఇక మరో రెండు రోజులు కూడా వర్షాలు పడుతాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇక ముఖ్యంగా నల్గోండ గతంలో ఎన్నడు లేని విధంగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. నల్గొండలో 6 గంటల్లోనే 20మి.మి వర్షపాతం నమోదైంది. వంద సంవత్సరాల క్రితం తర్వాత మళ్లీ ఇంత భారీగా వర్షాలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీకి బుధవారం సాయంత్రం ఎగువ ప్రాంతం నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో 16 గేట్ల ద్వారా 1.20 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.