భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు..

449
Diesel Prices
- Advertisement -

బుధవారం దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్‌ భారీగా పెరిగాయి. పెట్రోల్ ధర 27 పైసలు, డీజిల్ ధర 26 పైసలు చొప్పున పెరిగింది. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.99కు చేరింది. డీజిల్ ధర రూ.71.75కు ఎగసింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఎప్పుడూ దాదాపు 10 పైసలులోపు పెరుగుతూ తగ్గతూ వస్తున్న దేశీ ఇంధన ధరలు నేడు 25 పైసలుకు పైగా పెరగడం గమనార్హం.

Petrol, Diesel Prices Hiked

బడ్జెట్‌ అనంతరం ఒకేరోజు ఈస్ధాయిలో పెట్రో ధరలు పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమనడంతో పాటు సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్‌ దాడుల నేపథ్యంలో పెట్రో ధరలు పేట్రేగిపోతున్నాయి. పెట్రో ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ 72.42 కాగా, హైదరాబాద్‌లో రూ 76.99 ముంబైలో రూ 75.26, చెన్నైలో రూ 69.57, కోల్‌కతాలో రూ 68.23 పలికింది.

- Advertisement -