హైదరాబాద్‌లో ఆసరా పెన్షన్‌ స్కామ్

664
asara pension scam
- Advertisement -

హైదరాబాద్‌లో ఆసరా పెన్షన్ల స్కామ్‌ వెలుగుచూసింది. లబ్దిదారుల నుంచి పెన్షన్లు కాజేస్తున్న  ముఠా గుట్టును రట్టుచేశారు హైదరాబాద్  సైబర్ క్రైమ్ పోలీసులు.

హైదరాబాద్ కలెక్టర్ ఫిర్యాదుతో ఈ స్కాం వెలుగు చూడగా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీకి చెందిన ఇమ్రాన్,సోహెల్, అస్లాం, మోసిన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ నలుగురు మూడు నెలల నుంచి దాదాపు 250 మందికి చెందిన ఆసరా పింఛన్లు డైవర్ట్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగి అస్లాం సహాయం అందించినట్లు పోలీసులు వెల్లడించారు. 2017 లో పింఛన్ల స్కాంలో అస్లాం జైలుకు వెళ్లి రాగా ఈ కేసులో మరికొంతమంది పరారీలో ఉన్నారు. వారికోసం సీసీఎస్ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

- Advertisement -