హృతిక్ రామాయణంలో రావణుడిగా ప్రభాస్..!

733
hrithik prabhas
- Advertisement -

బాలీవుడ్‌లో భారీ ప్రెస్టెజియస్ ప్రాజెక్టు రామాయణం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్,నమిత్ మల్హోత్ర,మధు మంతెనా ఈ సినిమాను నిర్మిస్తుండగా నితీష్ తివారి దర్శకత్వం వహించనున్నారు.

ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ రాముడిగా,. దీపికా పదుకొణె సీతగా నటిస్తుందని వార్తలు వెలువడుతుండగా బీ టౌన్‌ సర్కిల్స్‌లో మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. బాహుబలి స్టార్ ప్రభాస్‌ని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగం చేయాలని దర్శకుడు నితీష్ భావిస్తున్నారట. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కనుండగా హిందీతో పాటు తెలుగు,తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

ప్రభాస్‌ని తీసుకోవడం ద్వారా సినిమాకు హైప్ రావడమే కాదు ప్రభాస్ మార్కెట్‌ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారట. దీనికి తోడు రామాయణంలో కీలకమైన రావణుడి పాత్రను ప్రభాస్‌ చేస్తే బాగుంటుందని చిత్రయూనిట్ ఆలోచన చేస్తుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడించనున్నామని దర్శకుడు వెల్లడించారు.

ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటించాల్సిందిగా ప్రభాస్‌ని సంప్రదించామని …ప్రస్తుతం చర్చల దశలో ఉండగా ప్రభాస్ ఒప్పుకుంటాడో లేదా వేచిచూడాలని తెలిపారు.

- Advertisement -