టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం చేసిన అనంతరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు తరలించారు. ఈరోజు సాయంత్రం కోడెల పార్ధివదేహాన్ని నరసరావు పేటకు తరలించనున్నారు.
కోడెల మృతిపట్ల ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణం తీసుకున్నారు. కోడెల అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు. ఈమేరకు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అధికారులకు అదేశాలు జారీ చేశారు. నరసరావుపేటలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
నరసారావుపేటలో రేపు ఉదయం కోడెల శివ ప్రసాద్ అంత్యక్రియలు జరుపనున్నారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య నేపథ్యంలో నరసరావుపేట డివిజన్ పరిధిలో ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 15 రోజులపాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.