కోడెల మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం

378
Ktr Kodela
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ మృతి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోడెల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధించినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇక కోడెల మృతదేహానికి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం కోడెల పార్ధివదేహాన్ని ఎన్టీఆర్ భవన్ కు తరలించారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, కోడెల అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నందమూరి బాలకృష్ణ, దేవినేని ఉమ, కేఈ కృష్ణమూర్తి తదితరులు నివాళులు అర్పించారు. కాగా, ఈరోజు రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు చేరుకోనున్నారు.

Ktr Tweet

- Advertisement -