నా తండ్రి మరణం పట్ల అనుమానాలు లేవుః కోడెల కుమార్తె

385
kodela
- Advertisement -

మా నాన్న మరణం పట్ల ఎవరిపై అనుమానాలు లేవని స్పష్టం చేశారు కోడెల కుమార్తె విజయలక్ష్మీ. కొద్ది రోజుల నుంచి మా నాన్న తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని చెప్పారు. ఉదయం అమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లెందుకు రెడీ అవుతుండగా కింద నాన్న తన రూమ్ లోకి వెళ్లాడని చెప్పింది.

ఆ తర్వాత ఒక అరగంట తర్వాత నాన్న బయటకు రావపోవడంతో వెళ్లి డోర్ కొట్టాం…ఎంతకు డోర్ తీయకపోవడంతో గన్ మెన్లను పిలిచి డోర్ పగుల గొట్టామని పోలీసులకు తెలిపారు విజయలక్ష్మీ. తాము డోర్ పగుల గొట్టే సరికే మా నాన్న ఫ్యాన్ కు ఉరివేసుకున్నారని తెలిపింది. నాన్నపై నమోదైన కేసులు చోటు చేసుకొంటున్న అవమానాలతో నాన్న తీవ్ర అవమానాలకు గురైనట్టుగా విజయలక్ష్మి పోలీసులకు వివరించారు. నాన్న ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదని విజయలక్ష్మి చెప్పారు.

- Advertisement -