బోటు ప్రమాదం…మరో 4 మృతదేహాలు వెలికితీత

470
papi kondalu
- Advertisement -

గోదావరి బోటు ప్రమాదంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్,అగ్నిమాపకదళం రంగంలోకి దిగి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు 8 మృతదేహాలను వెలికితీసిన సిబ్బంది ఇవాళ మరోనలుగురి ఆచూకీని కనుగొన్నారు.

కచ్చలూరు సమీపంలో మరో నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాల్లో నెలల వయస్సున్న చిన్నాకరి కూడా ఉండటం అందరిని కలిచి వేసింది. మృతుల బంధువులకు సమాచారం అందించారు. ఆచూకీ లభించని మిగితావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాల సంఖ్య 12 కి చేరింది.

ఎన్డీఆర్ ఎఫ్, నేవీ సిబ్బంది నిన్న 27 మందిని సురక్షితంగా ప్రాణాలతో కాపాడారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. ఏపీ మంత్రులు, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అధికారులు సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -